E-PAPER

శేరిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా చెర్కం మంజుల ఎల్లం ముదిరాజ్ నామినేషన్ దాఖలు

-అనూహ్యంగా ముందుకు వచ్చిన యువ నాయకులు
-గ్రామ రాజకీయాల్లో కొత్త పుంతలు

మెదక్ జిల్లా డిసెంబర్ 02

మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో అనూహ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన యువతి ధైర్యంగా ముందుకు వచ్చి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు.వివరాల్లోకి వెళ్తే నార్సింగి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన చెర్కం మంజుల ఎల్లం ముదిరాజ్ మంగళవారం నాడు చివరి నిమిషంలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నాడు శేరిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల నామినేషన్ల కౌంటర్లో చివరి నిమిషంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మంజుల ఎల్లం ముదిరాజ్ మాట్లాడుతూ…గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి గ్రామంలో 40% ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గాన్ని గత పాలకులు అణిచివేస్తూనే ఉన్నారనీ ఆ పోకడలు రూపుమాపి తమ ఊరు గ్రామాభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని,గ్రామ ప్రజలు సర్పంచ్ గా నాకు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా నామినేషన్ వేయడానికి గ్రామ ప్రజలందరూ తమకు ధైర్యాన్నిచ్చి తోడుగా వచ్చిన అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఓటు వేసి గెలిపించాలని మీడియా ద్వారా కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!