మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో అంతర్గత విబేధాలు తీవ్ర రూపం దాల్చాయి. తొలకాల కేటాయింపుల విషయంలో నెలకొన్న తేడాలపై ఒకే వ్యక్తికి వరుసగా కేటాయింపులు జరగడంపై అసోసియేషన్ ప్రశ్నించగా ఈ విషయంపై వాట్సప్‌లో బూతులతో వాయిస్ మెసేజ్‌లు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఓ సభ్యుడు రెచ్చిపోయి అసోసియేషన్‌లోని మిగతా సభ్యులను బూతులతో దూషించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
తొలకాల పైనే పెత్తనం సభ్యుల్లో అసహనం
ఒక వ్యక్తి తనకే అనుకూలంగా తొలకాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తోండని, న్యాయంగా పంచాలని అసోసియేషన్ డిమాండ్ చేయడంతో ఈ వివాదం ముదిరిందని అసోసియేషన్ నాయకులు వై 7 న్యూస్‌కు తెలిపారు.
బొగ్గు తొలకాలు రాకపోవడంతో లారీ యజమానులు లబోదిబో అవుతున్నారని సభ్యులు వాపోయారు.
పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయతీ
వాట్సప్ గ్రూపులో ప్రారంభమైన ఈ బూతుల పర్వం, చివరకు మణుగూరు పోలీస్ స్టేషన్ వరకు చేరింది. అసోసియేషన్ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









