మెదక్ జిల్లా డిసెంబర్,2
మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి బండారు సంతోష గొండస్వామి తమ అనునాయ వార్డు సభ్యులతో కలిసి సోమవారం నాడు తన నామినేషన్ పత్రాలను ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సంతోష గొండస్వామి మాట్లాడుతూ… రాజకీయంగా అపార అనుభవం ఉన్న తమ కుటుంబం నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తున్నందున అన్ని వర్గాల ప్రజలు తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.గ్రామ అభివృద్ధికి శాయాశక్తుల కృషి చేస్తానని తెలిపారు.గ్రామ అభివృద్ధి కోసం తనను బలపరచాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Post Views: 93









