కొత్తగూడెం జిల్లా విద్యార్ధిని ఒమనా శ్రీ వెన్నెల పాల్గొననున్నారు
హైదరాబాద్:
నవ్య నాటక సమితి, తెలంగాణ భాషా–సంస్కృతి శాఖ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 50వ ఆల్ ఇండియా మ్యూజిక్ అండ్ డాన్స్ పోటీలు–2025 ఈ నెల 15 నుంచి 22 నవంబర్ వరకు హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్న సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
కొత్తగూడెం జిల్లాకు చెందిన గంధం ఒమనా శ్రీ వెన్నెల (D/o వెంకట్) ఈ జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిష్టాత్మకంగా పాల్గొననున్నది. పోటీలు 15 నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్నప్పటికీ, ఒమనా శ్రీ వెన్నెల ప్రదర్శనలు నవంబర్ 17న నిర్వహించబడనున్నాయి.
దేశవ్యాప్తంగా నుండి వందలాది మంది కళాకారులు, సంగీత–నృత్య కళాశాఖలకు చెందిన ప్రతిభావంతులు ఈ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శిస్తుండగా, విజేతల ప్రదర్శనలు ఈ నెల 23వ తేదీన రవీంద్రభారతిలో ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించనున్నారు. ప్రతి విభాగంలో మొదటి స్థానాలు సాధించిన వారు ఈ వేడుకలో మెరిసే అవకాశం పొందనున్నారు.
కళలను ప్రేమించే వేదికగా, యువ ప్రతిభను వెలికితీసే జాతీయస్థాయి సంబరంగా ఈ పోటీలు పేరుపొందాయి. కోతగుడెం జిల్లాకు చెందిన ఒమనా శ్రీ వెన్నెల పాల్గొనడం స్థానిక కళాభిమానుల్లో ఆనందం కలిగిస్తోంది.









