కొత్తగూడెం, జూలై 29 వై 7 న్యూస్;
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు అతిధి గౌరవంతో స్వాగతం తెలిపారు.ఈ సందర్బంగా రామచంద్రరావుకు ఒక చిరు జ్ఞాపికను అందజేసిన లింగంపల్లి రమేష్ (భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు, నేషనల్ హ్యూమన్ రైట్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి) పార్టీ పట్ల నిబద్ధతను వ్యక్తం చేశాడు.పార్టీ కార్యకలాపాలు, బలోపేతంపై జిల్లా స్థాయి నాయకత్వంతో రాష్ట్ర అధ్యక్షుడు చర్చలు నిర్వహించాడు. స్థానిక స్థాయిలో పార్టీని మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశాడు.
Post Views: 200