బ్రిడ్జ్ మునక ముప్పు తప్పింది
ఎం ఎల్ ఏ పాయం వెంకటేశ్వర్లు ప్రయత్నాలకు ప్రజల ప్రశంసలు
మణుగూరు, జులై 23 వై 7 న్యూస్;
మణుగూరు రైల్వే గేట్ దగ్గర మామిడిచెట్ల గుంపు వద్ద ఉన్న బ్రిడ్జ్ ఈ సంవత్సరం వరద ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. అయితే ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముందస్తు ఆలోచనలతో పూడికతీత పనులు చేపట్టిన కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ పూడికతీత పనుల వల్ల వరద నీరు ఎటువంటి అడ్డంకులు లేకుండా కోడిపుంజుల వాగులో కలిసిపోతుండడంతో, బ్రిడ్జ్ మునిగే పరిస్థితి నుంచి బయటపడింది. ఈ ప్రాంతాన్ని సందర్శించే ప్రజలు ఎలాంటి అసౌకర్యం లేకుండా తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు.
స్థానిక ప్రజలు ఈ చర్యల పట్ల కృతజ్ఞతను తెలియజేస్తూ, ఇలాంటి ముందస్తు ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.
పులిపాటి పాపారావు
Post Views: 240