కరకగూడెం, జూలై 23 వై న్యూస్ తెలుగు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని సమత్ భట్టుపల్లి వద్ద బూడిద వాగు భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లుతోంది. వాగు ఉధృతిని తట్టుకోలేక బ్రిడ్జి వద్ద కోతకు గురైన ప్రాంతం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.పరిస్థితిని సమీక్షించేందుకు ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో కుమార్, ఎంపీవో మారుతి కోతకు గురైన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. వర్షాలు కొనసాగితే బ్రిడ్జికి మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్ అడ్డంగా పెట్టి ప్రస్తుతానికి రాకపోకలు నిలిపివేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగు వరద ప్రవాహానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రిపోర్టర్, కె. దిలీప్
Post Views: 563