E-PAPER

దశాబ్దాలుగా మారని తలరాత

ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఫలితం శూన్యం

వరద ప్రవాహం ముంచుకొస్తే ఆ గ్రామానికి వెళ్లడం కష్టమే

నాగరికత పెరిగిన రవాణా మార్గం నేటికి సరిగా లేదు

దీని వెనక ఎవరన్న ప్రజాప్రతినిధులు అడ్డుకట్ట ఉన్నదా లేక ఆలస్యం అవుతున్న దా

కలెక్టర్ సార్ ఇప్పటికైనా మా గోడు వినండి

భద్రాద్రి కొత్తగూడెం ములకలపల్లి: వై సెవెన్ తెలుగు న్యూస్: జూలై 23 ములకలపల్లి మండలం సాప్రాల పల్లి గ్రామపంచాయతీ, ఇటు చాప్రాలపల్లి అటు కుమ్మరిపాడు గ్రామాల మధ్యలో ఉన్నటువంటి వాగు, దశాబ్దాలుగా ఆ యొక్క గ్రామాల ప్రజలకు మారని తలరాతగా, దర్శనమిస్తున్న ప్రజా ప్రతినిధులు మాత్రం ఓట్లు అప్పుడు వస్తారు, ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతారు. అయినా గిరిజనుల తలరాత మాత్రం మారలే,
ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి కానీ ప్రజలు మాత్రం ఓట్లు వేస్తూనే ఉన్నారు నమ్మి ప్రజాప్రతినిధులకు అధికారం అంట గడుతూనే ఉన్నారు. కానీ వచ్చిన ప్రజాప్రతినిధులకు ఈ గిరిజన గ్రామం అంతుపట్టదా గిరిజనులు కళ్ళకు కనిపించడం లేదా, ఏమిటి ఈ పరీక్ష ఇప్పటికైనా ప్రజాప్రతినిధుల మనసు మారి, గిరిజనుల వైపు చూపు మల్లుతుందా

వర్షం కారణంగావరద ప్రవాహం ముంచుకొస్తే ఆ గ్రామానికి వెళ్లడం కన్నా కష్టమే, గతంలో పొట్ట పోసుకోవడానికి వెళ్లిన కూలీలు సైతం ప్రాణాలు పోగొట్టుకొని. కుటుంబాలు నిరాశరీయులై అమాయక జీవితాలను గడుపుతున్న సంఘటనలు లేకపోలేదు కానీ పాలకులకు మాత్రం ఇంత జరిగిన నిమ్మకు నీరెత్తినట్టు చూడడం అనేది చెప్పుకోదగ్గ విషయం

ఆధునికత నాగరికత ఎంత పెరిగిన, కనీస రవాణా మార్గాల వైపు దృష్టి పెట్టకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు, ఒకవైపు ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా గిరిజన గ్రామాల అభివృద్ధికి ఎంతో ఖర్చు చేశాం ఎంతో ఖర్చు పెడతాం అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూనే కాలం వెళ్లదీస్తున్నారు.

అసలు దీని వెనక కారణం ఎవరైనా ప్రజాప్రతినిధులు గిరిజన అభివృద్ధి జరిగితే వారవలేక అపుతున్నరా, లేక అధికారులు నిర్లక్ష్యంతో కనీసం ఎస్టిమేట్లు వేసి పంపించక ఆగిపోతుందా, ఏది ఏమైనా, అమాయక ప్రజల జీవితాలతో ఆట అధికారులకు అలవాటైపోయింది,

కలెక్టర్ సార్ ఇప్పటికైనా మా చెల్లి మీరైనా దృష్టి పెట్టి ఈ యొక్క వంతెన నిర్మాణ పనుల్ని, ఎస్టిమేట్ వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి వంచన నిర్మాణానికి తోడ్పడగలరని మా రెండు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.

ఇదే వాగులో వరదనీటి ప్రవాహానికి గతంలో పొట్ట పోసుకోవడానికి వెళ్ళిన కూలి, నేడు చప రాళ్లపల్లి గ్రామానికి చెందిన, రైతు గండ్ర పిచ్చయ్యకు చెందిన పాడి పసుపు కూడా వరదనీటి ప్రవాహంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి, ఈ యొక్క వంతెన నిర్మాణానికి కలిసికట్టుగా కృషిచేసి మా రెండు గ్రామాల రాకపోకలకు అంతరాయం కలగకుండా తోడ్పడతారని ప్రజలు కోరుకుంటున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్