E-PAPER

సింగరేణి డంపింగ్ యార్డ్ వల్ల మణుగూరుకు ముప్పు… MLA జాగ్రతతో తప్పిన పెను ప్రమాదం!

మణుగూరు, జులై 23 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో భారీ వర్షాల నేపథ్యంలో సింగరేణి డంపింగ్ యార్డ్ వల్ల ఉత్పన్నమైన వరద ముప్పు తీవ్రంగా నిలిచింది. సింగరేణి అధికారులు ఏర్పాటు చేసిన చెరువు అలుగు కట్ట తెగిపోవడంతో గాంధీనగర్ వెనుకవైపు వాగులోకి నీటి ప్రవాహం మళ్లి ప్రమాదకర పరిస్థితి నెలకొంది.

ఇక గాంధీనగర్ ప్రాంతానికి ముప్పు పొంచి ఉన్న దశలో మణుగూరు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో అపాయానికి తావు లేకుండా నిలిచింది. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అధికారులు మరియు స్పందించిన యంత్రాంగానికి ఎమ్మెల్యే సమన్వయం కల్పించారు.

స్థానికులు మాట్లాడుతూ “ఎమ్మెల్యే గారు ముందు జాగ్రత తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సకాలంలో చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రమైన ఉండేవి” అని పేర్కొన్నారు.

ఈ వరద కారణంగా సింగరేణి GM కార్యాలయం నుంచి మణుగూరు ప్రధాన రహదారి వరకు భారీగా నీరు చేరడంతో రాకపోకలు స్థంభించాయి. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

ఇదిలా ఉండగా, సింగరేణి అధికారులు ముదస్తు చర్యల్లో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సరైన ఏర్పాట్లూ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..

రిపోర్టర్: బానోత్ మధు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్