E-PAPER

బీఎస్పీలో చేరికలు… బహుజన చైతన్యానికి నిదర్శనం

చర్ల ,జూన్ 27 వై 7 న్యూస్;

చర్ల మండల కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కార్యాలయంలో ఎస్ కేకె జహురుద్దీన్, చింత శ్రీనివాస్‌లు బీఎస్పీలో చేరారు. చర్ల మండల ఉపాధ్యక్షులు గోగికార్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరిద్దరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బహుజన చైతన్యాన్ని ప్రతిబింబించే ఈ చేరిక పార్టీ బలోపేతానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అధికారం సాధించేందుకు బహుజనులంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నేతలు సామల ప్రవీణ్, గుర్రాల విజయ్ కుమార్, కొండా చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :