మణుగూరు, జూన్ 27 వై 7 న్యూస్;
సింగరేణి డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రు గురువారం మణుగూరు ఏరియా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జీఎం ఛాంబర్‌లో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా మణుగూరు ఏరియాలోని కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి సంబంధించిన మెమోరాండం ను ఆయనకు అందజేశారు. ముఖ్యంగా హాస్పిటల్ లో ఔషధాల కొరత, వైద్య సిబ్బంది లేకపోవడం, రెసిడెన్షియల్ క్వాటర్ల పరిస్థితి, తాగునీటి సమస్యలు, పీకే ఓ2 బేస్ వర్క్ షాప్ పరిసరాల లో దుర్వస్థితి వంటి అంశాలను ప్రస్తావించారు.
ప్రధాన డిమాండ్లు:
* ఏరియా హాస్పిటల్ లో బిపి, షుగర్ వంటి అత్యవసర మందుల సరఫరాలో నిరంతరత ఉండేలా చర్యలు
* ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ పోస్టులకు త్వరితగతిన నియామకాలు
* పాతబడి నశించిన క్వాటర్లను పునఃనిర్మించాలి
* పీకే ఓ2 వర్క్ షాప్ లో సిమెంట్ ఫ్లోరింగ్ చేయాలి, తాగునీటి సదుపాయం కల్పించాలి
* ఖాళీగా ఉన్న మైనింగ్ స్టాఫ్, సూపర్వైజర్లు, క్లరికల్ పోస్టుల భర్తీ
* డంపర్లు, షావల్స్, డోజర్ల సంఖ్య పెంచి, అవి మంచి పరిస్థితిలో ఉండేలా చూడాలి
* మహిళా ఉద్యోగుల కోసం గనులలో రెస్ట్ రూంలు, క్రంచీలు ఏర్పాటు చేయాలి
* N-1 వన్ ప్లే డే, పీహెచ్‌డీ విధానాల తొలగింపు
* మణుగూరు సింగరేణి పాఠశాలలో CBSE సిలబస్ ప్రవేశపెట్టడం
* ఓసి ఫోర్ గనిలో మైన్స్ మరియు సేఫ్టీ కమిటీ మీటింగ్లు నిర్వహించేలా చర్యలు
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ వై. రాంగోపాల్, వైస్ ప్రెసిడెంట్ ఎం.వి. రాం నర్సయ్య, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మేకల ఈశ్వరరావు, ఆఫీస్ బేరర్ శనిగరపు కుమారస్వామి పాల్గొన్నారు.
పులిపాటి పాపారావు | జర్నలిస్ట్