గుండాల జూన్ 27 (వై సెవెన్ న్యూస్ తెలుగు): గుండాల మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో నైట్ వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తూ మండల కేంద్రానికి చెందిన ఊకే లక్ష్మి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. శుక్రవారం ఆ పాఠశాల ఉపాధ్యాయినీలు, బోధనేతర సిబ్బంది దశదినకర్మలకు 15,300 నగదు, క్వింటా బియ్యం, 5 కేజీల కందిపప్పు ను మరియు సర్వ శిక్షణ అభియాన్ కుటుంబ సభ్యులు 26,500 నగదు ను లక్ష్మీ భర్త లింగయ్య కు, కూతురు జ్యోతి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబా పాఠశాల ఉపాధ్యాయినీలు, బోధ నేతర సిబ్బంది, సర్వ శిక్షణ అభియాన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 103









