చర్ల మండలంలో 1000 కోట్ల ఇసుక దోపిడీ ఆరోపణలు
ఆదివాసీ చట్టాలపై ప్రజాప్రతినిధుల మౌనం అధికారుల తీరుపై విమర్శ
పర్యావరణ విధ్వంసం పెసా కమిటీలకు పాతర
గోదావరి పరివాహక ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన జరపాలి
ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు డిమాండ్
చర్ల జూన్ 27 వై 7 న్యూస్;
పెసా, 1/70, ఎల్టీఆర్ వంటి చట్టాలను పక్కనపెట్టి, ఆదివాసీ హక్కులను పాతరేసి, ఆదివాసీ ప్రాంతాల్లో వేల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా దోచిపెట్టేందుకు రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు రాజకీయ నాయకులతో చేతులు కలిపారని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు తీవ్ర ఆరోపణలు చేశారు.
రాజు మాట్లాడుతూ,పెసా చట్టం ప్రకారం గ్రామసభలకే అంతిమ అధికారం. కానీ గ్రామసభల ఆమోదం లేకుండానే రెవెన్యూ అధికారులు ఇసుక ర్యాంపుల్ని ఏర్పాటు చేశారు. ఇది చట్టానికి విరుద్ధం. కొందరు ఆదివాసీలకు ముట్టజెప్పి మొత్తం సమాజాన్ని మోసం చేస్తున్నారు.” అని ఆరోపించారు.
ఇసుక ర్యాంప్ ల వల్ల ఉపాధి కోల్పోయిన వనవాసులు
గోదావరి పరివాహక ప్రాంతాల్లో జరిగిన ఈ దోపిడీ వల్ల అక్కడి స్థానిక ఆదివాసీ కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. అడవుల్లో, నదుల ఒడ్డు వద్ద మత్స్యకారులు, శ్రమికులు జీవనం సాగించే పరిస్థితులే లేకుండా పోయాయి. అడవి గిరిజనుల జీవనరీతిని ఛిన్నాభిన్నం చేసే విధంగా బొబ్బిలి రాజులా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇసుక దోపిడీ వెనుక భారీ కుట్ర?
ఈ మొత్తం వ్యవహారానికి మూలకారణం ఆదివాసీ ప్రాంతాల్లో భారీగా ఉన్న ఇసుక సంపద. అందుకు కొన్ని వేల కోట్ల రూపాయల విలువ ఉందని తెలుస్తోంది. ఈ ఐశ్వర్యాన్ని అంధ్ర ప్రదేశ్‌కి చెందిన కాంట్రాక్టర్లు అక్రమంగా రవాణా చేస్తూ, ప్రైవేట్ ర్యాంపుల ముసుగులో దోచుకుంటున్నారని ఇరప.రాజు తీవ్రంగా విమర్శించారు.
1000 మన జేబులో పెట్టి… 10,000 వేలు రైజింగ్ కాంట్రాక్టర్ ముసుగులో దోచుకుంటున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి సీతక్క… ఒక ఆడబిడ్డగా స్పందించాలి!
ఆదివాసీల తరఫున పోరాడతామంటూ ఎన్నికైన ములుగు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీతక్క ఇప్పటికీ గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటన చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గోదావరి తీరంలోని ఇసుక ర్యాంపుల వద్దికి వెళ్లి స్థానికుల గోడు విని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఆదివాసీలను మట్టిలో కలుపుతున్నాయో స్వయంగా చూసి, స్పందించాలి” అని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఆదివాసీ ఎమ్మెల్యేలతో సమావేశం సీఎం కు నివేదిక
త్వరలోనే ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ ఎమ్మెల్యేలను కలిసి ఈ వ్యవహారాన్ని వివరించనున్నారు. తదనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుసుకుని… భద్రాచలం నియోజకవర్గంలో జరుగుతున్న చట్టవ్యతిరేక చర్యలపై నివేదిక సమర్పించనున్నట్లు ఇరప.రాజు తెలిపారు.