పలాస జూన్ 27 వై 7 న్యూస్(దినేష్ రిపోర్టర్);
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా పలాస పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఒక భారీ అవగాహనా ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ప్రత్యేకంగా ఏర్పాటైన నార్కోటిక్ టాస్క్ ఫోర్స్‌కు “ఈగర్” అనే పేరు పెట్టి, డ్రగ్ మాఫియాపై దాడులు ప్రారంభించింది.
ఈ సందర్బంగా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కాశీబుగ్గ బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆర్‌డీఓ గారు, తహసీల్దార్ గారు, పోలీసు అధికారులు, స్థానిక స్కూల్, కాలేజీల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని వివిధ పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.
ర్యాలీ ద్వారా ప్రజల్లో డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించడంతో పాటు, యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచే దిశగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అధికారులు పేర్కొన్నారు.