E-PAPER

యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన మణుగూరు మండల ఎయిడ్ సి ఎస్ ఏం జ్యోతి

మణుగూరు జూన్ 26 వై 7 న్యూస్;

అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా మణుగూరు మండల ఎయిడ్క కమ్యూనిటీ సోషల్ మొబలైజర్ (సీఎస్‌ఎం) జ్యోతి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అధికారి లేనీనా ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె డ్రగ్స్ వాడకాన్ని వ్యతిరేకిస్తూ, యువతను ఈ కీడు వ్యసనాల నుండి దూరంగా ఉంచాల్సిన బాధ్యతపై చర్చించారు.

ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ,
“మన దేశ యువత శక్తివంతమైనవారు. వారికి సరైన దారి చూపితే దేశ అభివృద్ధికి పెద్ద వనరుగా మారతారు. కానీ చిన్న వయస్సులో ఒత్తిడిని తట్టుకోలేక కొందరు యువత డ్రగ్స్ అనే అగాధంలో పడిపోతున్నారు. ఇది కేవలం వారి జీవితాలను కాకుండా, వారి కుటుంబాలను, సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రతి తల్లిదండ్రి, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, మనందరం కలసి ఈ యువతకు మద్దతుగా నిలవాలి. నేడు నిర్వహిస్తున్న యాంటీ డ్రగ్స్ డే కేవలం ఓ కార్యక్రమం మాత్రమే కాదు… ఇది మన సమాజం కోసం తీసుకునే ఓ సంకల్పం.” అని అన్నారు. డ్రగ్స్ వినాశనంపై అవగాహన కల్పించే ర్యాలీలు, నినాదాలు, పోస్టర్ల ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి. కమ్యూనిటీ సోషల్ మొబలైజర్‌గా జ్యోతి గ్రామాల స్థాయిలో చైతన్య వేదికలు ఏర్పాటు చేసి, పాఠశాలల్లో ప్రత్యక్షంగా సందర్శిస్తూ యువతతో మాట్లాడి, “జీవితాన్ని ప్రేమించండి . డ్రగ్స్‌ను దూరంగా పెట్టండి” అనే సందేశాన్ని బలంగా వినిపిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News