ఆదివాసీ ప్రజలకు దోమతెరలను పంపిణీ చేసిన గుండాల పోలీసులు
గుండాల, జూన్ 18 వై 7 న్యూస్;
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు గుండాల మండలంలోని దామెరతోగు గ్రామంలో నేతకాని గుంపులో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ జి.నరేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దని తెలిపారు.ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా పయనించాలని తెలిపినారు.అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించవద్దని తెలిపారు.మావోయిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలని తెలిపినారు.ఇల్లందు డిఎస్పి చంద్రభాను మాట్లాడుతూ యువత,పిల్లలు విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు.అసాంఘీక శక్తులకు సహకరించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా కేసులు,జైలు పాలు కావద్దని సూచించారు.
వర్షాకాలంలో తమ ఇండ్ల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అధికంగా మురుగు నీరు చేరడం వలన దోమలు అధికమై డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్ వంటి విషపూరిత జ్వరాల బారిన పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు.అనంతరం అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు డిఎస్పి చంద్రబాను గార్లు తమ చేతుల మీదుగా అక్క నివసించే ప్రజలకు 50 దోమ తెరలను పంపిణీ చేశారు.పిల్లలకు నోట్ బుక్స్,పెన్నులు పంచారు.మొబైల్ నెట్వర్క్ సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.దోమతెరల పంపిణీకి సహకరించిన ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ మెంబర్ పాషా ను అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో గుండాల సీఐ రవీందర్,ఎస్సై రవూఫ్ మరియు గుండాల పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.