పలాస, జూన్ 13:
సీతంపేట నియోజకవర్గంలోని పలాసలోని సూర్యాతేజ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి సాయికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాలో మొత్తం 15 కంపెనీలు పాల్గొన్నాయి.ఈ జాబ్ మేళాలో మొత్తం 595 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. ఇందులో 269 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇది పలాస ప్రాంతంలో నిరుద్యోగుల కోసం ఒక గొప్ప అవకాశం కావడం విశేషం.ఈ కార్యక్రమంలో స్కిల్ హబ్ కో-ఆర్డినేటర్ రమేష్, కళాశాల అధ్యాపకులు, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.
– Y7 News Telugu | Spot Report
Post Views: 16