మణుగూరు, జూన్ 11 (వై 7 న్యూస్)
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఉపాధ్యాయురాలు శ్రీజ పేర్కొన్నారు. మణుగూరులోని పద్మగూడెం యు.పి.ఎస్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, “బాల కార్మిక వ్యవస్థ ఒక సాంఘిక దురాచారం. దీని వల్ల పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది” అని తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బడికి వెళ్లని పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించి, బాల కార్మికులు లేని మండలంగా మణుగూరును తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎయిడ్ సంస్థ మండల కమిటీ ఆర్గనైజర్ నాగుల జ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.బాలల హక్కులపై చట్టాలు, మధ్యాహ్న భోజన పథక నిర్వహణ, బాలల అక్రమ రవాణా నిషేధం వంటి అంశాలపై ప్రధానోపాధ్యాయులు, మెనూ ఏజెన్సీ నిర్వాహకులకు అవగాహన కల్పించారు. కార్యక్రమం ద్వారా పిల్లల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.









