వై 7 న్యూస్, పలాస
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ ఎన్. రామారావు నేతృత్వంలో ప్లానింగ్ సెక్రటరీలతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.కమీషనర్ ఆదేశాల మేరకు,
నిర్మాణానికి మంజూరు చేసిన ప్లాన్ లేకుండా జరుగుతున్న భవనాలను గుర్తించాలి.సంబంధిత బిల్డింగ్ యజమానులపై కోర్టుల్లో కేసులు నమోదు చేయాలని సూచించారు.అనధికార లేఅవుట్లు మరియు వాటిలో జరుగుతున్న అభివృద్ధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారి, ఇతర ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ తక్షణ చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
Post Views: 21