మణుగూరు,మే28 (వై 7 న్యూస్)
మణుగూరులోని శ్రీవారి జువెలర్స్ షాపులో తేది 23.05.25న 132 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగతనమైన ఘటనపై కేసు నమోదు కాగా, విచారణలో ఆకివీడు నివాసి గొర్రెల సత్యనారాయణ అరెస్ట్ అయ్యాడు. సీసీ కెమెరా ఆధారంగా విచారణ చేపట్టిన మణుగూరు పోలీసులు నిందితుడిని పట్టుకొని బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై రెండు రాష్ట్రాల్లో 35పైగా కేసులు ఉన్నాయి. వరంగల్, తిరుపతి, కర్నూల్‌ల్లోనూ నేరాలు చేసినట్టు అంగీకరించాడు. నిందితుడిని కోర్టులో హాజరు పరచనైనది. కేసు ఛేదనలో పాల్గొన్న పోలీసులను డిఎస్పి అభినందించారు.
Post Views: 434