రఘు వీరారెడ్డి కి ఆతిథ్యం ఇచ్చిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కుటుంబం
కొత్తగూడెం, మార్చి 07 వై 7 న్యూస్;
భద్రాద్రి జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యులు రఘు వీరారెడ్డి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. ముందుగా భద్రాచలం రామయ్య ను దర్శించుకుని పూజలు చేసిన రఘు వీరారెడ్డి సుజాతనగర్ లోని నాగా సీతారాములు ఇంట్లో అతిద్యం స్వీకరించి భోజనం చేశారు. ఇంటికి వచ్చిన రఘు వీరారెడ్డి కు నాగా సీతారాములు కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారాములు కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న రఘు వీరారెడ్డి పార్టీ అభ్యున్నతి కోసం, కార్యకర్తల కోసం కష్టపడే వారికి పార్టీలో సుస్థిర స్థానం ఉంటుందన్నారు. ఆయన వచ్చిన విషయం తెలుసుకుని సీతారాములు ఇంటికి చేరుకున్న కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు.
Post Views: 65