ప్రగతిశీల మహిళా సంఘం (POW) జిల్లా కార్యదర్శి కెచ్చల కల్పన పిలుపు.
భద్రాచలం మార్చి 07 వై 7న్యూస్ తెలుగు
సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలపై దాడులు పరువు హత్యలు హత్యాచారాలు జరగడం దారుణమైన విషయమని వీటిని ప్రగతిశీల శక్తులు ఖండించాలని ప్రగతిశీల మహిళా సంఘం POW భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పిలుపు నిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరణించుకొని. శుక్రవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యాలయంలో శ్రీమతి మునిగల మహేశ్వరి అధ్యక్షత నా మహిళా సమావేశం జరిగింది మహిళా రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్న మహిళల్ని కాపాడలేకపోతున్నాయని రాజ్యాంగం కూడా కాపాడ లేకపోతుందని కల్పన ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మోడీ ప్రభుత్వం మహిళల ఎడల మరింత దారుణమైన పరిస్థితి లో నికి నెట్ట వెయ్యాలని, ప్రయత్నం చేస్తున్నదని ప్రస్తుతం రాజ్యాంగ స్థానంలో సనత ధర్మ సూత్రాలు ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తుందని ఇట్టి ప్రయత్నాలను ప్రగతిశీల శక్తులు అడ్డుకోవాలని స్త్రీలు స్వేచ్ఛ స్వతంత్ర సమానత్వం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కె రంగారెడ్డి, POW జిల్లా సహాయ కార్యదర్శి సరోజిని, శారద, కుమారి ,శాంతమ్మ ,కృష్ణవేణి , చినతల్లి, దాసరి సాయన్న, మునిగల శివ , పాలెం చుక్కయ్య. తదితరులు పాల్గొన్నారు.