E-PAPER

ATYCA యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య

హైదరాబాద్,డిసెంబర్23 (వై 7న్యూస్);

అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య ని హైదరాబాద్ లో వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా యూనియన్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో కలిసి పుష్పగుచ్చం అందజేసిన ఆంధ్ర తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ సీఈఓ అసోసియేషన్(ATYCA) జాతీయ అధ్యక్షులు పులిపాటి పాపారావు. అనంతరం యూనియన్ 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన పొదెం వీరయ్య. పొదెం వీరయ్య న్యూస్ ఛానల్ సీఈఓ లందరిని పేరు పేరునా పలకరించి మా ఈ ప్రభుత్వం జర్నలిస్టు సంక్షేమం కోసం కట్టుబడి ఉందని , రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు తగు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియజేశారు.అసోసియేషన్ అధ్యక్షులు పులిపాటి పాపారావు మాట్లాడుతూ నూతన సంవత్సర క్యాలెండర్ పొదెం వీరయ్య గారితో ఆవిష్కరించడం సంతోషంగా వుందని రాబోయే రోజుల్లో యూనియన్ ప్రతి ఒక్క న్యూస్ చానల్ సీఈఓ లందరికీ ,జర్నలిస్టు కు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రేఖా భద్రి,సంయుక్త కార్యదర్శి, సేక్.ఖాసిం ,పత్తెం రమేష్ పటేల్, ఉపాధ్యక్షులు కొమరయ్య,కార్యవర్గ సభ్యులు, ఎం.డి.ఫైసుద్దీన్, మద్ది లక్ష్మీ నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్