E-PAPER

ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలి : డి ఆర్ డి ఓ విద్యా చందన.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా; డిసెంబర్ 10 వై 7 న్యూస్;

అంతర్జాతీయ మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని నవంబర్ 19 నుండి డిసెంబర్ 10 వరకు నిర్వహించిన కార్యక్రమాల ముగింపు సభ ఐడిఓసి కార్యాలయం డిఆర్డిఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డిఓ విద్యా చందన మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్వహించుకోవాలని,బహిరంగ మల, మూత్ర విసర్జన వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో సామూహిక మరుగుదొడ్ల నిర్వహణ మరియు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణ పోటీలలో గెలుపొందిన వారికి సన్మానం మరియు మేమంటోలు బహుకరించారు. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్వహణకు గాను 1)అన్నపురెడ్డిపల్లి మండలం పెద్ది రెడ్డిగూడెం గ్రామపంచాయతీలోని కుంజా వినోద,2) బూర్గంపాడు మండలం, ముసలమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని పెరుమళ్ళ శ్రీను,3) బూర్గంపాడు మండలం,పినపాక పట్టి నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని గడ్డల ఇందిరా,4) మణుగూరు మండలం సమితి సింగారం గ్రామం మడకం లక్ష్మి మరియు 5) పాల్వంచ మండలం యానం బైలు గ్రామపంచాయతీ పరిధిలోని ముద్దంగుల దేవమ్మ లను సన్మానించారు. సామూహిక మరుగుదొడ్డి నిర్వహణలో బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామంలో సంత సమీపంలో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ కు గాను పంచాయతీ సెక్రెటరీ ని సన్మానించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి మరియు అడిషనల్ డి ఆర్ డి ఓ రవి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :