E-PAPER

సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర 38 వ రోజు

బాన్సువాడ డిసెంబర్11 వై సెవెన్ న్యూస్ తెలుగు

బాన్సువాడ పట్టణంలో మంగళవారం రోజున ఉదయం అయ్యప్ప స్వామికి మాల వేసుకుని పాదయాత్ర చేసి వచ్చి ఇరుముడి తీసుకొచ్చి స్వామికి సమర్పించుకోవడం జరిగింది. ఈరోజు నెయ్యాభిషేకం పూర్తి చేసుకుని స్వాములందరికీ నెయ్యియాభిషేకం ప్రసాదం ఇవ్వడం జరిగింది. ఈరోజుతో సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈ సంవత్సరం పాదయాత్ర విజయవంతం చేసుకుని ముగించుకుంటున్నాం. ఈరోజు సన్నిధానం నుండి ప్రయాణంలో భాగంగా ఈరోజు సన్నిధానం నుండి చెంగునూరుకు బయలుదేరుతున్నాం .ఈ సంవత్సరం మహా పాదయాత్రకు చాలామంది సహాయ సహకారాలు ఇచ్చినారు వస్తురూపేనా డబ్బు రూపేనా ఆర్థికంగా బలంగా ధైర్యంతో చాలామంది యాత్రను నడిపియాలని భావన తోటి పెద్ద మనసు చేసుకొని ఈ సంవత్సరం యాత్రకు సహకరించిన అందరికీ అదేవిధంగా భిక్ష దాతలుగా అల్పాహరా దాతలుగా వాహన సేవగా చేసిన ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి అనుగ్రహం లభించాలని పాదయాత్ర చేసిన బృందం అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. యాత్రలో పాలుపంచుకున్న గురు స్వాములకు స్వాములకు సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర తరఫున ధన్యవాదాలు తెలియజేసిన గురుస్వామి వినయ్ కుమార్

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :