పినపాక, డిసెంబర్ 10 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం , గోపాలరావుపేట గ్రామప్రజల నుండి తరతరాలుగా సాగుచేసుకుంటున్న పేద రైతుల వద్దనుండి పెద్ద ఎత్తున నవోదయ స్కూల్ నిర్మాణం పేరుతో రైతుల దగ్గరనుండి 126.07 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక తహశీల్దార్ కార్యాలయం హెచ్చరిక బోర్డులు పెట్టిన విషయం తెలిసినదే.గత నాలుగు రోజులుగా రైతులు చేస్తున్న పోరాటాన్ని చూసి చలించిన మణుగూరు పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త,లాయర్ కర్నె రవి గోపాలరావుపేట గ్రామాన్ని సందర్శించి రైతుల బాధలు తెలుసుకొని అండగా ఉంటానని తెలిపారు. రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని స్పష్టం చేశారు..
Post Views: 150