తూప్రాన్ డిసెంబర్10 వై సెవెన్ న్యూస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచక పాలనలో ఆశా వర్కర్లకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి మెదక్ జిల్లాల నుండి వస్తున్న ఆశా వర్కర్లను తూప్రాన్ శివార్ లోగల టోల్గేట్ వద్ద అడ్డుకున్నారు. కరోనా కష్టకాలంలో కూడా తన సొంత ఇంటి వారే చూడని పరిస్థితిలో పేషెంట్లను మేము దగ్గరుండి సేవ చేశామని అలాంటిది నేడు రేవంత్ రెడ్డి మా డిమాండ్ల కోసం వెళుతుంటే ఏక్కడివారిని అక్కడ అరెస్టు చేయడం దారుణమన్నారు. ఆశ వర్కర్లతో పనిచేయించుకోవడం సరే కానీ నీటికి ఫిక్స్డ్ వేతనం లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఆశ వలన అడ్డుకున్నంత మాత్రాన ఉద్యమము ఆగదని దీనికి వెక్కింపు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మా ఆశ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.









