E-PAPER

హలో బిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న

కొత్తగూడెం,డిసెంబర్ 10 వై 7 న్యూస్;

డిసెంబర్ 16, 17,18 తారీకులో జరిగే హలో బీసీ చలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా విజయవంతం చేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవి ప్రసన్న పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం ఉపేందర్ నాయుడు ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ సీమకుర్తి రామకృష్ణ తో కలిసి హలో బీసీ చలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క బీసీ నాయకులు కార్యకర్తలు అందరిని తమ వంతు బాధ్యతగా భావించి అధిక సంఖ్యలను ప్రజలను మమేకం చేయాలని కోరారు. బీసీ సంఘాలను చైతన్యం చేసి, చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లు చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన, మహిళా రిజర్వేషన్లలో ఓబిసి మహిళలకు సబ్ కోట, విద్య ఉద్యోగ రంగాల్లోబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ కేబినెట్ లో ప్రత్యేక బిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బీసీ విద్యార్థులకు 100% ఫీజు రియంబర్స్మెంట్ ను కల్పించాలని కోరారు. జాతీయస్థాయి ఓబీసీ సబ్ ప్లాన్, సాధనలకోసం జరిగే మహా ధర్నాను బీసీ మేధావులు బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్