E-PAPER

తెలంగాణ తల్లి రూప కల్పన మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి బిఆర్ఎస్ నాయకులు

తూప్రాన్ డిసెంబర్10 వై సెవెన్ న్యూస్

తూప్రాన్ మండలం లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటీఆర్ , మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు పిలుపు మేరకు తూప్రాన్ మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహనికి పాలభిషేకం చేసి పూల మాలవేయడం జరిగింది.ఈ సందర్బంగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిన్న సచివాలయం లో ప్రతిష్టించిన విగ్రహం తెలంగాణ తల్లీ కాదు అని తెలిపారు.కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలి అనుకున్నవారు లేకుండా పోయినారని బి ఆర్ ఎస్ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇస్తానన్న 6 హామీలు నెరవేర్చకుండా కల్లగొల్లి మాటలతో ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలను త్వరగా నెరవేర్చాలని బిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ జెడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్, మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాబుల్ రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, తూప్రాన్ మున్సిపల్ మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ బురాన్,తూప్రాన్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి అహ్మద్, బిఆర్ఎస్ నాయకులు షేక్ సత్తార్, ఎండి వహీద్,రాజిరెడ్డి, ప్రశాంత్, మాజీ ఎంపిటిసి ఎక్కల దేవ్ వెంకటేష్, ఇతర గ్రామాల సర్పంచులు, యూత్ అధ్యక్షులు, వార్డు మెంబర్లు,తదితరులు పాల్గొనడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్