E-PAPER

తూప్రాన్ పెద్ద చెరువు లో పడి మంగలి బాల్ రాజు మృతి

తూప్రాన్, డిసెంబర్,08. వై సెవెన్ న్యూస్

తూప్రాన్ కు బార్బర్ షాప్ యాజమాని మంగలి సాట్కూరి బాలరాజు (45) శనివారం ప్రమాదవశాత్తు పెద్ద చెరువు లో పడి మృతి చెందాడు. శనివారం ఉదయం వాకింగ్ చేసిన తర్వాత తూప్రాన్ పెద్ద చెరువు కట్ట పై ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం లో దర్శనం చేసుకొని అతని మోటార్ బైక్, తన మొబైల్ ఫోన్ ను కట్ట పై పెట్టీ కాళ్లుకడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడు. ఎంత సేపటికీ బార్బర్ షాపుకి గాని, ఇంటికి గాని రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు వెతుకడంతో కట్ట పై బైక్ కన్పించడం తో అనుమానం వచ్చి చెరువులో గాలించగా బాలరాజు మృత దేహం లభించింది. ఈ మేరకు తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మధ్య కాలంలో బాలరాజు కు షుగర్ వ్యాది సంక్రమించడం తో వైద్యులు కల్లు, మద్యం త్రాగ వద్దని సూచించారు. కాగా బాలరాజు కల్లు కు బానిసై సేవించేవాడు. కాగా వైద్యుల సూచన తో కల్లు సేవించడం మానివేయడంతో మానసికంగా కలత చెంది చెరువులో కాళ్ళు కడుకోవడానికి వెళ్లి కాలు జారీ పడి మృతి చెందాడు. బాలరాజు కు భార్య, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు పెళ్లి అయ్యింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్