జుక్కల్ డిసెంబర్ 08 వై సెవెన్ న్యూస్ తెలుగు
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో గల కస్తూర్భా గాంధీ బాలికలవిద్యాలయాన్ని
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఎమ్మెల్యే పాఠశాలకు వెళ్లిన సమయంలో విద్యార్థినిలు కరాటే శిక్షణలో నిమగ్నమవగా ఆసక్తికగా తిలకించారు.
అనంతరం సిబ్బందిని అడిగి పాఠశాలలోని విద్యార్థుల చదవు మరియు ఇతర వివరాలు తెలుసుకున్నారు.వసతి గృహంలోని విద్యార్థులకు ప్రభుత్వం డైట్,కాస్మోటిక్ చార్జీలు పెంచిందని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Post Views: 19