బాన్సువాడ డిసెంబర్ 08 వై సెవెన్ న్యూస్ తెలుగు
బాన్సువాడ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కామారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12వ జిల్లా స్థాయి ఇన్ స్పైర్,52 వ జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024-25 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి,రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజులతో సబ్ కలెక్టర్ కిరణ్మయి సైతం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మా బాన్సువాడ పట్టణంలో జరుపుకునే అవకాశం కల్పించిన జిల్లా విద్యాశాఖ శాఖ అధికారులకు,స్థానిక నాయకులకు ప్రతెక్య ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రతిభను కనబర్చిన విద్యార్థిని విద్యార్థులకు పోచారం తన చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,జిల్లా విద్యాధికారి రాజు ,జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు కుషాల్, ఎంఈఓలు,ప్రజాప్రతినిధులు,నాయకులు,అధికారులు,ఉపాద్యాయులు,విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.