E-PAPER

సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులలో అవేర్ నెస్ కాంపెయిన్ నిర్వహించిన కాకినాడ డిఎస్పి

వై7 న్యూస్ ప్రతినిధి (కాకినాడ జిల్లా):

కాకినాడ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో విద్యార్థిని, విద్యార్థులలో మరియు ప్రజలలో సైబర్ నేరాల గురించి చైతన్యం తీసుకురావడానికి, కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, IPS., ఆదేశాల మేరకు కాకినాడ డి.ఎస్.పి రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో, కాకినాడ నన్నయ యూనివర్సిటీలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు డిజిటల్ అరెస్ట్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ లో జరిగే అక్రమాలు, ఎంప్లాయిమెంట్ లో జరిగే అక్రమాలు, కేవైసి పరంగా జరిగే అక్రమాలను సైబర్ నేరస్థులు ఏ విధంగా పాల్పాడతారు అనేదానిపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియోలు, పోస్టర్ లు చూపించి, ఇవి వాట్సాప్ గ్రూపులు, ఇతర ప్లాట్ ఫార్మ్స్ ద్వారా సోషల్ మీడియా లో ఏ విధంగా ప్రసారం చేయబడతాయి అనే విషయాలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో, కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ , తిమ్మాపురం ఎస్ఐ, పెదపూడి ఎస్ఐ, కోరంగి ఎస్ఐ , కరప ఎస్ఐ, ఇంద్ర పాలెం ఎస్ఐ, రూరల్ సర్కిల్ పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్