యువతను ప్రోత్సహించడమే నా లక్ష్యం జుక్కల్ ఎమ్మెల్యే
జుక్కల్ నవంబర్ 22 వై సెవెన్ న్యూస్ తెలుగు
జుక్కల్ నియోజకవర్గం లోని సీనియర్ల గా చెప్పుకుంటున్న వ్యక్తులు యొక్క చరిత్ర జుక్కల్ నియోజకవర్గం ప్రజలకు అంతా తెలుసు అని హైదరాబాదులో హంగామా చేసినంతమాత్రాన ఇక్కడి ప్రజలు నమ్మరని, యువతని ప్రోత్సహించడమే నా లక్ష్యమని, రాహుల్ గాంధీ ఆశయాల కనుగుణంగా, యువతని రాజకీయంలో తీసుకురావాలని దాని కికట్టుబడి పని చేస్తున్నానని, కాంగ్రెస్ పెద్దలు ముందే తెలిపారు. అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి తెలిపినప్పటికీ నేనేమైనా పర్వాలేదు కాంగ్రెస్ పార్టీ నీ నమ్ముకున్న వ్యక్తులని యువతని ప్రోత్సహించడమే నా ఉద్దేశం అనిఈరోజు బిచ్కుంద మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. సీనియర్లు యువతని ప్రోత్సహించే విధంగా ముందుకు రావాలని ఆయన వేడుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, విట్టల్ రెడ్డి, పుల్కల్ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్పల్లి గంగాధర్, సాయిని అశోక్, సిద్ధప్ప పటేల్, హనుమంతరావు, హనుమంత రెడ్డి,వెంకట్ రెడ్డి, భీమ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.