ప్రజాస్వామ్య బద్దంగా జరగనున్న ఎన్నికలను అడ్డుకోవడం నియంత పాలనకు నిదర్శనం
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
కొత్తగూడెం,నవంబర్ 20వై 7న్యూస్
కొత్తగూడెం నియోజకవర్గంలో సింగరేణి సంస్థలోని సింగరేణి టిప్పర్స్ మరియు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికను నిర్వహించకుండా ఆప్రజాస్వామ్యంగా అడ్డుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.
ఈ సంఘం నాయకులను రెండు వర్గాలుగా విడగొట్టి గత 8 నెలలుగా వారి వద్దకు తిప్పుకుంటూ ఎన్నికలు నిర్వహించకుండా వారి మీద అధికారం పెత్తనం చెలాయిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని,దీంతో ఈఅంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్,టిపిసిసి సభ్యులు జేబీ.శౌరీ ని ఇరువర్గాల వారు కలిసి వారి సమస్యను వివరించగా ఇరువర్గాల వారితో సంప్రదింపులు జరిపి సామరస్య పూర్వకంగా ఎన్నికలు జరిపేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.ఈ క్రమంలో ఈనెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆర్.సి వెరిఫికేషన్ నిర్వహించారని వివరించారు.14,15 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేయడం,18వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ జరిగిందన్నారు.గురువారం స్థానిక సిఇఆర్ క్లబ్ లో ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకొన్నారని,న్యాయవాదులుగా ఈఎన్నికల పర్యవేక్షకులుగా వెళ్ళిన నన్ను,మారపాక రమేష్ లను సిఈఆర్ క్లబ్ లో ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసుకోనగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి చుంచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలిపారు.ఎన్నికలు నిర్వహించడం ఏవిధంగా చట్టవ్యతిరేక కార్యక్రమం అవుతుందో తెలపాలని ప్రశ్నించారు?.పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికను అడ్డుకోవడం నియంత వైఖరికి నిదర్శనమన్నారు.పొట్టచేత పట్టుకొని బ్రతుకుతెరువు కోసం ఈనియోజకవర్గానికి వచ్చిన నాయకులు నియంతలా వ్యవహరిస్తు వారి ఉనికికోసం ఇరు వర్గాల వారిని బానిసలుగా తమ వద్దే పడి ఉండాలని ఒక అధికార దర్పంతో ప్రయత్నిస్తున్నారని,ఎమ్మెల్యే ఆయన ప్రధాన అనుచరుడు చేసే నియంత పనులని కొత్తగూడెం ప్రజలు గమనిస్తున్నారని,ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం వాటిల్లేలా ఎలక్షన్లు జరగనీయకుండా అడ్డుకున్న వారికి ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.ఇటువంటివి ఒక లాయర్ గా ఈ విషయాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు.
అరెస్ట్ అయిన వారిలో బరిలో ఉన్న ఇద్దరు సహా అసోసియేషన్ సభ్యులు బూర్గుల అనీల్ కుమార్,తానంగి రవికుమార్ ,మైల చైతన్య
పెండ్యాల శ్రీనివాస్,దువ్వ సంపత్ కుమార్
కాంటాత్మక ముఖేష్,సారా మహేందర్
కోలా నాగవర్మ లు వున్నారు.