E-PAPER

ఖమ్మంలో జరిగే యాదవ వన సమారాధన కార్యక్రమం ను జయప్రదం చేయండి

ప్రచార జాత వాహనాన్ని ప్రారంభించిన అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నాయకులు

ఖమ్మం,నవంబర్20 వై 7 న్యూస్;

ఈనెల 24 ఆదివారం చెరుకూరు గార్డెన్స్ ఖమ్మంలో యాదవ్ వన సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క యాదవ కుటుంబం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, యాదవ యువజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ పిలుపునిచ్చారు.యాదవ వన సమారాధన కార్యక్రమం ను గ్రామాలలో, పట్టణాలలో ప్రచారం చేయుట కొరకు, యాదవులను చైతన్యం చేసి ఆహ్వానించడం కొరకు బుధవారం నాడు ఖమ్మంలో ప్రచార ఆటోలు, జీపులను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ ఉన్నత, పేద వర్గాలు అనే తేడా లేకుండా ప్రతి యాదవ కుటుంబం మేమంతా యాదవులం అనే సంకల్పంతో సహాపంక్తి భోజనం చేయడమే కార్తీక మాసం యాదవ వనభోజన ప్రధాన ఉద్దేశమని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కురుమ, మరియు జిల్లా, రాష్ట్ర, జాతీయ అఖిలభారత యాదవ మహాసభ నాయకులుపాల్గొంటారని, కావున రాజకీయాలకతీతంగా, వర్గాలకతీతంగా ప్రతి యాదవ కుటుంబం పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో… చేతులు నాగేశ్వరరావు మొరిమేకల కోటయ్య, తెల్లబోయిన రమణ కనక బండి విజయలక్ష్మి, పొదిల భూపతి, బండారు ప్రభాకర్, నన్నే బోయిన పద్మ,రాగం ప్రభాకర్, కన్నెబోయిన రవి, మేడుదుల మల్లేష్ ఫంకు మురళి మరియు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్