E-PAPER

ధమ్ పేట వాసులకు ఇళ్ళ పట్టాలు మంజూరు చేసి, మౌలిక వసతులు కల్పించాలి;కర్నాకుల

పెద్దాపురం,నవంబర్ 15 వై 7 న్యూస్ ప్రతినిధి ;

కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 40వ వర్ధంతి సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గం, పెద్దాపురం ఒకటో వార్డు దమ్ పేటలో భూమికోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం విప్లవ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ఏఐఎఫ్టీయు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు అధ్యక్షత వహించగా ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. సభలో ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. సభ అనంతరం పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ దోపిడీ రహిత సమాజం కోసం విప్లవోద్యమంలో అనేక మంది అమర వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని కొనియాడారు.సమాజం లో నిరుద్యోగం, వివక్షత, దోపిడి, లంచగొండితనం వంటి రుగ్మతలు పెరిగిపోయాయన్నారు. ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, రోగం వస్తే వైద్యం అందక అనేకమంది సతమతమవు తున్నారన్నారు. పెద్దాపురం ఒకటో వార్డు దమ్ పేట వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి , మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కోసం ప్రజలు అమరుల పోరాట స్పూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. అప్పుడే మనం అమరులకు అర్పించి నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్ సి ఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, డివిజన్ నాయకులు డి. సురేష్, బీడీలు నాగేశ్వరరావు, తోట వీరబాబు, కోట అప్పల నరస, చిన్న వెంకటలక్ష్మి, పలివెల సత్తిబాబు, వల్లూరి రాజబాబు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు,
ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు,
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :