1,60,000 వసూలు చేశారు అటవీశాఖ అధికారులు అంటూ బాధితుల ఆరోపణలు
చిత్తూరు జిల్లా.
పలమనేరు నియోజకవర్గం.
పలమనేరు: రూరల్ మండలం బండమీద జరావారి పల్లికి చెందిన హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులు ముందు మా ఊరు దగ్గర ఊర పందిని కోసుకుంటుంటే అడవి పంది అని చెప్పి అటవీ శాఖ అధికారులు మా వద్ద ఉన్న ఫోన్లు లాక్కొని చావభాదారన్నారు. అంతేకాకుండా కేసు కట్టకుండా ఉండేందుకు నాలుగు లక్షలు డిమాండ్ చేయగా మా దగ్గర ఉన్న గొర్రెలు,ఆవులు అమ్మి 1,60,000 ఇచ్చామన్నారు. ఈ ఘటనపై డిఎఫ్ఓకు ఫిర్యాదు చేసి ఉన్నామన్నారు. న్యాయం చేయాల్సిందిగా మీడియాను కోరారు. కాగా ఈ ఘటనపై నిజా నిజాలు జిల్లా అటవీ శాఖ అధికారులు వెల్లడించాల్సి ఉంది.
Post Views: 248