E-PAPER

జాతీయస్థాయి లెజెండ్ అవార్డు అందుకున్న పూజారి జ్యోతి

మణుగూరు, అక్టోబర్ 30 వై సెవెన్ న్యూస్;

హైదరాబాదులో మంగళవారం జరిగినటువంటి కల్తీ నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ (కే ఎన్ డి) ఖమ్మం, స్వర మధురిమ మెగా కల్చరల్ ఖమ్మం వారి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయి విశ్వవిఖ్యాత కీర్తి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం త్యాగరాయ గాన సభ మెయిన్ హాల్ హైదరాబాద్ లో జరిగింది . ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కు చెందిన గాయని పూజారి జ్యోతి కి స్వచ్ఛంద సేవ గాయని విభాగంలో 2024 జాతీయస్థాయి లెజెండ్ అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా గాయని పూజారి జ్యోతి మాట్లాడుతూ నాకు అవార్డు రావడానికి సహకరించిన కమిటీ సభ్యులకు నన్ను వెన్నంటి ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకు నా తోటి గాయని గాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మణుగూరు పట్టణ పుర ప్రజలు పూజారి జ్యోతి కి శుభాకాంక్షలు తెలియజేస్తూ గాన ప్రపంచంలో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్