కార్మిక చిహ్నాలపై సరైన పర్యవేక్షణ కరువు
కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలి
కార్మిక అత్మ గౌరవం, ఔనత్యాన్ని పెంపొందించాలి.
యస్ ఓ టూ జి యం శ్యామ్ సుందర్ కు వినతి పత్రాన్ని అందించిన నాగెల్లి.
మణుగూరు,అక్టోబర్17 వై 7 న్యూస్
కార్మిక ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సింగరేణి కార్మికుల చిహ్నాలు కాంస్య విగ్రహాల రూపంలో ప్రతిష్టించి ఏరియా ఔనత్యాన్ని మరింత పెంపొందించాలని ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి తెలియచేశారు. ఈ సందర్భంగా యస్ ఓ టూ జి యం శ్యామ్ సుందర్ కు అయన వినతి పత్రాన్ని అందించారు. పీవీ కాలనీ క్వార్టర్ నిర్మాణం జరిగిన సమయంలో కూనవరం రైల్వే గేట్ పక్కకి కార్మిక రూపాలతో ఉండే చిహ్నాలను నెలకొల్పిన యాజమాన్యం ఆ చిహ్నాల పై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల విగ్రహాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు.యాజమాన్యం నిర్దేశించిన లక్ష్యాలను కార్మిక వర్గం సమిష్టి కృషి ద్వారా ఎప్పటికప్పుడు సాధిస్తూ ఏరియాకు కోట్లాది రూపాయలు లాభాలు సాధించిపెడుతూ ఏరియా ఖ్యాతిని దశ దిశల వ్యాపింప చేయడం జరుగుతుందని అలాంటి ఆదర్శవంతమైన ఏరియాలోనే సింగరేణి కార్మిక కొత్త చిహ్నాల ఏర్పాటు లేకపోవడం బాధాకరమని తెలిపారు. సి టైప్, రైల్వే స్టేషన్ కు వెళ్ళే జంక్షన్ తో పాటు భద్రాద్రి స్టేడియంలో కూడా తట్ట చెమ్మస్ తో కూడిన సింగరేణి కార్మిక కాంస్య చిహ్నాలు రెండు ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చిహ్నాల ఏర్పాటు కార్మికుల్లో మరింత రెట్టింపు ఉత్సాహం నింపడమే కాకుండా పని పట్ల మరింత భాధ్యత పెరుగుతుందని సంస్థ ప్రగతి కి, కార్మిక ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు.ప్రతి ఏటా డిశంబర్ నెలలో ఏరియా నందు అంగరంగ వైభవంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు వేడుకలను యాజమాన్యం పండుగ లాగా నిర్వహించడం జరుగుతుందని సింగరేణి ఆవిర్భావ దినోత్సవం నాటికి కార్మిక విగ్రహాల చిహ్నాలు ఏర్పాటు చేయడం ఏరియాకు మరింత శోభాయమానం తెచ్చిపెడుతుందని ఈ అంశంలో యాజమాన్యం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని వినతి పత్రం రూపంలో యాజమాన్యాన్ని కోరారు.