అశ్వాపురం అక్టోబర్ 08 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని ఓం శక్తి దేవాలయం నుండి అశ్వాపురం బస్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్తున్న మణుగూరు కి చెందిన మంగమ్మ అనే మహిళను, మంగళవారం రాత్రి బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది.గాయపడిన మహిళను స్థానికులు అశ్వాపురంలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా తీవ్ర గాయాలు కావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మణుగూరు ప్రభుత్వ వైద్యశాలకు ఆటోలో స్థానికులు తరలించారు.
Post Views: 496