తుమ్మలగుంట,అక్టోబర్ 08 వై 7 న్యూస్;
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు మంగళ వారం రాత్రి 7గంటల నుంచి గరుడ వాహనంపై స్వామి వారు ఊరేగనున్నారు. గరుడవాహన దాసుడైన శ్రీవారిని దర్శించడానికి భక్తులు తరలి రావాలని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఏటా తిరుమల తరహాలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భక్తులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గరుడవాహన సేవను కూడా అదే తరహాలో నిర్వహించనున్నాం. తిరుమల వెళ్లి గరుడసేవను తిలకించలేని భక్తులు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగే గరుడ సేవను తిలకించవచ్చు. భక్తుల సౌకర్యార్థం గరుడ వాహన సేవను రాత్రి 7 గంటల నుంచి 11గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. స్వామి దర్శనార్థం తుమ్మలగుంటకు వచ్చే భక్తులు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నిర్దేశించిన పార్కింగ్ స్థలాలో మాత్రమే వాహనాలు పార్క్ చేసి భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.