తూప్రాన్ సెప్టెంబర్ 8. వై సెవెన్ న్యూస్
తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో గత 26 సంవత్సరాలుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా దసరా ఉత్సవాల్లో అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని తూప్రాన్ చెందిన దుర్గా భవాని సేవా సమితి సభ్యులు మెదక్ ఎంపీ. మాధవ నేనే రఘునందన్ రావును కలిసి ఘనంగా సన్మానించి ఆహ్వాన పత్రికను అందించారు ఎంపీ రఘునందన్ రావు సానుకూలంగా స్పందించి ఉత్సవాలకు హాజరవుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ శాఖ అధ్యక్షులు భూమన్న గారి జానకిరామ్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంటాయపాలెం వేణుగోపాల్, బీజేవైఎం అధ్యక్షులుచిన్న లింగ్ కార్తీక్ గౌడ్, రాసముల్ల వెంకటేష్ సంతు పాల్గొన్నారు.
Post Views: 259