E-PAPER

ఇమామ్ పూర్ లో భజరంగ్ దళ్ ఏర్పాటు

తూప్రాన్. అక్టోబర్ 5 వై సెవెన్ న్యూస్

హిందువులలో ఐక్యత తీసుకురావడంతో పాటు హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తున్న బుజరంగ్ దళ్ ఇమామ్ పూర్ లో తన శాఖను వి ఎహ్ పి మెదక్ విభాగ్ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాటుచేయటం జరిగింది . దీనికి అధ్యక్షుడిగా అల్లాడి స్వామి, ఉపాధ్యక్షుడిగా మన్నె బాలేష్, విద్యార్థి ప్రముఖ్ శీల లక్ష్మణ్, గోరక్ష ప్రముఖ్ అల్లాడి నరేష్, సప్తహిక్ మిలన్ ప్రముఖ్ మన్నే మహేష్, శరీరక్ ప్రముఖ్ శీల భరత్, న్యాయ సలహా ప్రముఖ్ మన్నే శివకుమార్,సభ్యులుగా మన్నే భూపాల్, అల్లాడి స్వామి, మన్నే రమేష్, శామీర్ పేట సంపత్ సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఏర్పాటైన సందర్బంగా మల్లేశంజీ మాట్లాడుతూ హిందువుల మాన బిందువులైన భూమి, గో మాత, స్త్రీ, ఆలయ మరియు హిందూ ధార్మిక గ్రంధాలను నిర్వీర్యం చేయడానికి ఎలాంటి కుట్రలు జరుగుతున్నవి అని వివరించి, వాటిని కాపాడుకోవలసిన ఆవశ్యకతను యువకులకు వివరిస్తూ యువకులు చెడు మార్గాల వైపు వెళ్లకుండా దేశం కోసం తమ వంతు కృషి చేయాలని సభ్యులకు మార్గ దర్శనం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :