రాజోలి,అక్టోబర్04 వై 7 న్యూస్;
రాజోలి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బరువు ఎత్తు బిపి షుగర్ రక్త పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గర్భిణీ స్త్రీలు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడాలని, ఆకు కూరలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి అని ఆయన అన్నారు. అలాగే ఆంగన్ వాడి కేంద్రము లో ఇచ్చే పౌష్ఠిక ఆహారం, గుడ్లు పాలు వాడాలని ఆయన మాట్లాడుతూ తెలిపారు. బరువు పనులు చేయరాదని అన్నారు. కాన్పు ఇంటి దగ్గర కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కావాలన్నారు. అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం లో టిబి నోడల్ అధికారి జయప్రకాశ్, హెల్త్ సూపర్ వైజర్ హెలెన్ రంజిత్ కుమార్, ఏ ఎన్ ఎం లు ఆశా కార్యకర్తలు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు