మిర్యాలగూడ,అక్టోబర్01 వై 7 న్యూస్
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అడవిదేవులపల్లి నుండి డొక్కల బాయి తండా వరకు పోయే ఆర్ అండ్ బి రోడ్డు చాలాచోట్ల భారీ గుంతలు అయి తరచు ప్రమాదాలు జరుగుతున్నవి. వర్షం పడ్డ ప్రతిసారి గుంతలు నీళ్లతో నిండి వాహనదారులు ఆ గుంతలో పడి ప్రమాధానికి గురవుతున్నారు. అడవిదేవులపల్లి నుండి జిలకర కుంట తండా,కొత్త నందికొండ, మొల్కచర్ల, బంగారికుంట తండా, బాలంపల్లి, చిట్యాల, నల్ల మెట్ట తండా, నడిగడ్డ గ్రామాల ప్రజలు నిరంతరము మండల కేంద్రం కు, హాస్పటల్ కు రావాలన్నా చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లకు,బ్యాంకులకు, వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రం వచ్చే ప్రజలు ద్విచక్ర వాహనదారులు, మోటార్ సైకిల్ పై వచ్చి ప్రజలు మరియు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు.కావున అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోని ఈ రోడ్డుకు మోక్షం కల్పించగలరని ప్రజలు కోరుతున్నారు.