భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్01 వై 7 న్యూస్
సింగరేణి సంస్థలో ఉద్యోగం పేరుతో 16 లక్షల రూపాయలు కట్టి తాము మోసపోయామని తెలిసి పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య చేసుకున్న సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాం తండాలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన హలావత్ రత్నకుమార్, పార్వతీ దంపతులు సింగరేణి ఉద్యోగం పేరుతో 16 లక్షల రూపాయలు ఓ వ్యక్తికి కట్టి తాము మోసపోయామని తెలిసి మనస్థాపంతో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసారంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.పరిస్థితి విషమించడంతో ప్రత్యేక చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలింపు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దంపతుల మృతి చెందారు.
Post Views: 167