కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం, సెప్టెంబర్ 29 వై 7 న్యూస్;
సోమవారం నాడు ఉదయం 10 గంటలకు కరకగూడెం మండలంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులుపాయం వెంకటేశ్వర్లు పర్యటించనున్నారని మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
మండలంలోని నూతన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ మరియు శంకుస్థాపన కార్యక్రమాలు కలవని, నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం అదేవిధంగా గ్రామపంచాయతీలో సమీక్ష సమావేశలు ఉంటాయని తెలియజేశారు..
కార్యక్రమాల వివరాలు;
. చోప్పాల గ్రామపంచాయతీ శ్రీరంగాపురం గ్రామం
. తాటిగూడెం గ్రామపంచాయతీ గాంధీ నగర్ గ్రామం
. కరకగూడెం గ్రామపంచాయతీ sc కాలనీ
. వట్టం వారి గుంపు గ్రామపంచాయతీలో
. చిరుమల్ల గ్రామపంచాయతీ లో పర్యటన ఉంటుంది కావున,మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు, పత్రిక మిత్రులు అభిమానులు, తదితరులు, సకాలంలొ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు..