కొత్తగూడెం,సెప్టెంబర్28 వై 7న్యూస్ ప్రతినిధి;
తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలపై కుట్ర చేస్తున్నారని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. బీజేపీలో అభద్రతాభావం పెరిగిందనడానికి శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై జరిగిన ఈడి దాడులే నిదర్శనమన్నారు. దేశంలో బీజేపీ పై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న వేళ కాంగ్రెస్ నేతలను భయాందోళనకు గురి చేసేందుకే ఐటి, ఈడీ, పోలీసుల దాడులను బిజెపి నేతలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆత్మీయ బంధువు మంత్రి పొంగులేటి శ్రీనన్న పై ఎన్ని సార్లు దాడులు చేసిన ఆయన్ని, ఆయన అనుచరగణాన్ని, ఆయన వెనకున్న ప్రజాసైన్యాన్ని భయపెట్టలేరని ఆయన అన్నారు. కాళేశ్వరం సహా, అనేక అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కేసీఆర్ అండ్ కో లపై మోడీ ఈడి ని పంపగలరా అని సవాల్ విసిరారు.