మిర్యాలగూడ ,సెప్టెంబర్ 22 వై7న్యూస్
శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మిర్యాలగూడ
ఆలయ అర్చకులు మాట్లాడుతూ కారంపూడి రాఘవచార్యులు, కమల్ కుమార్ చార్యులు, అధ్యక్షులు సూదిని వెంకట్ రెడ్డి , కార్యదర్శి కన్నగుండ్ల రంగయ్య మాట్లాడుతూ,తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై తీవ్ర చర్చ జరుగుతుండగా, నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ల్యాబ్ ఇచ్చిన రిపోర్టులో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయని, తిరుమల లడ్డూ తయారీ కోసం వినియోగించిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలు 20 శాతం కంటే తక్కువగా ఉన్నాయని,ఈ కల్తీ నెయ్యిలో ఉండే.. ఆస్కారం ఉన్న పదార్థాలకు సంబంధించిన జాబితాను రిపోర్టులో పేర్కొందనీ వారు అన్నారు. వాటిలో ఫిష్ ఆయిల్, జంతువుల కొవ్వు తదితర పదార్థాలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయమని, న్యాయ నిపుణులతో,చర్చించి త్వరగా లక్షలాది మంది భక్తుల ఆందోళన తగ్గించి, భక్తులకు ఇబ్బంది కలగకుండా తిరుపతి లడ్డు ప్రసాదాన్ని మరల యధావిధిగా కొనసాగే విధంగా కృషి చేయాలని, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టమి మెరుగుపరచాలని తెలియజేసారు..